బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ జవాన్. బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను రూ.36 కోట్లకు ప్రముఖ సంస్థ టి సిరీస్ సొంతం చేసుకోవటం టాక్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీగా మారింది.