పెద్ద నోట్ల రద్దుతో సినిమా రంగం కుదేలైంది. కలెక్షన్స్‌కు బ్రేక్ పడింది. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు. రిలీజ్ డేట్స్ ప్రకటించినా విడుదల చేయాలంటే నిర్మాతలు జంకుతున్నారు. అయితే ఈ పరిస్థితిని అధిగమించడానికి కన్నడ సినీ పరిశ్రమ కంకణం కట్టుకుంది. శాండిల్‌వుడ్ సినీ ప్రేమికులకు తీపి కబురందించింది.