సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథానాయకిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించిన నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది.
తొలిసారి రంగమ్మత్త గెటప్‌లో దిగిన తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా.. మరో రెండు రోజుల్లో రంగమ్మత్తను థియేటర్లలో కలవండి అని తన ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఈ నెల 30న రంగస్థలం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.