భూతద్ధం భాస్కర్‌ నారాయణగా శివ కందుకూరి

మంగళవారం, 2 ఆగస్టు 2022 (17:32 IST)
Siva Kandukuri
సినిమా ఎంత గొప్పగా నిర్మించామన్నది కాదు, ప్రమోషన్‌ ఎంత డిఫరెంట్‌గా చేశామన్నదే ఇప్పటి ట్రెండ్‌. ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి ఇప్పటి నుంచే ప్రేక్షకులకు నచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారి అభిరుచిని భూతద్ధంలోంచి చూస్తున్నాడు మా భాస్కర్‌ నారాయణ. పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రొడక్షన్‌ విలువలు ఎక్కడా తగ్గకుండా, కథని నమ్మి నిర్మించిన చిత్రమే భూతద్ధం భాస్కర్‌ నారాయణ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ని ఈరోజు విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.   
 
ఈరోజు విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌ లో ఓపెన్‌ చేస్తే శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారదమునితో పాటు ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడమని ఆ విష్ణుమూర్తిని వేడుకొంటాడు. దానికి సాక్షాత్తు ఆ నారాయణుడు చింతించకు ఇంద్రదేవా..! కలియుగంబున భువిపైన జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నానని చెప్పడంతో హీరో శివ కందుకూరి, అదే మన భూతద్ధం భాస్కర్‌ నారాయణ ఎంట్రీ. షర్టు వేసుకుని, లుంగీ కట్టుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని, రివాల్వర్‌ తీసుకుంటాడు. 
 
పోలీస్‌ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్‌ అంటించి అందర్నీ ఆకట్టుకుంటాడు భూతద్ధం భాస్కర్‌ నారాయణ. ఈ గ్లింప్స్‌ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్‌ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్‌ కథే ఇది. విలేజ్‌లో డిటెక్టివ్‌ ఏంటి అనిపిస్తుంది కదా..! అదే డైరెక్టర్‌ వినూత్నంగా ప్రెజెంట్‌ చేశారు. థ్రిల్‌ కలిగించే ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమే ఈ భూతద్ధం భాస్కర్‌ నారాయణ. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ శరవేగంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.
 
నటీనటుడు:
శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌, దేవీప్రసాద్‌, వర్షిణి, శివకుమార్‌, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్‌ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరులు
 
సాంకేతిక నిపుణులు:
రచన-దర్శకత్వం: పురుషోత్తం రాజ్‌
నిర్మాతలు: స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: గౌతమ్‌ జి
ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌
ప్రొడక్షన్‌ డిజైనర్: రోషన్‌ కుమార్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌: అశ్వంత్‌, ప్రతిభ
స్టంట్స్‌: అంజిబాబు
పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్‌
డిజిటల్‌: హౌస్‌ఫుల్‌ డిజిటల్‌

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు