మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల విదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్, బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్యలు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు.