కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అంగీకరించింది.
థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని, అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నెల 28న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌ను విచారించనున్నారు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అత్యాచారం ఆరోపణలపై జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.