శ్రద్ధాదాస్ , అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ చిత్రం త్రికాల. స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ ట్యాగ్ లైన్. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్ నిర్మాత గా, శ్రీసాయి దీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి, ఓంకార్ పవన్ లు సహా నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.