గీత రచన, దానికి తగ్గట్టు ట్యూన్, సంగీతం, వాటన్నిటికి అతికినట్లు తీసిన క్రిష్... మొత్తంగా సూపర్బ్. ఈ రొమాంటిక్ పాటను ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే మధురంగా వుంది. ఉప్పెన చిత్రంతో యువ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ మరోసారి కొండపొలంతో ఆకట్టుకోవడం ఖాయంగా అనిపిస్తుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో చక్కగా అభినయాన్ని పండించినట్లు తెలుస్తుంది.