ఇప్పటికే విడుదలైన 'టక్కర్' మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఊపిరే' అంటూ సాగే మూడో పాట విడుదలైంది.
ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటల మాదిరిగానే 'ఊపిరే' పాట కూడా కట్టిపడేసేలా ఉంది. అభయ్ జోధ్‌పుర్కర్, సంజన కలమంజే ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. "సొగసే మా వీధి వైపు.. సరదాగా సాగెనే.. దిశలేమో నన్ను చూసి.. కను గీటెనే" అంటూ కథానాయికపై కథానాయుడికి ఉన్న ప్రేమను తెలిపేలా ఎంతో అందంగా ఉంది ఈ పాట. తేలిక పదాలతో లోతైన భావం పలికించారు కృష్ణకాంత్.
నాయకా నాయికల మధ్య మొహాన్ని తెలిపేలా అద్భుతమైన సాహిత్యంతో పాట సాగింది. సంగీతానికి, సాహిత్యానికి తగ్గట్టుగానే నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. పాట వినగానే నచ్చేలా ఉంది. గత రెండు పాటల్లాగే ఈ పాట కూడా విశేష ఆదరణ పొందుతుందని స్పష్టమవుతోంది. మొత్తానికి టక్కర్ నుంచి విడుదలవుతున్న ఒక్కో పాట విశేషంగా ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను రోజురోజుకి పెంచేస్తోంది.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.