సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK
ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి3 BHK అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని బ్యూటీఫుల్ ఫ్యామిలీగా కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
సిద్ధార్థ్ కూల్ అండ్ చార్మ్ లుక్ తో ఆకట్టుకున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు ప్రజెన్స్ కూడా అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా రూపొందుతొందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.
2025 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
నటీనటులు: సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు, మీఠా రఘునాథ్ , చైత్ర
రచన, దర్శకత్వం: శ్రీ గణేష్, నిర్మాత : అరుణ్ విశ్వ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్. సిబి మారప్పన్, ఫోటోగ్రఫీ డైరెక్టర్: దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్, సంగీతం: అమృత్ రామ్‌నాథ్, ఎడిటర్: గణేష్ శివ, డైలాగ్స్: రాకేందు మౌళి, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్