లేటైనా లేటెస్ట్‌గా వచ్చినట్లు.... సూర్య నటించిన 'సింగం 3' చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత గురువారం విడుదలైంది. తమిళంలో విడుదలైంది కానీ.. తెలుగులో విడుదలకు ఆలస్యమైంది. మార్నింగ్ షో 11 గంటల ఆట పడలేదు. క్యూబ్ వర్షన్ కాబట్టి టెక్నికల్‌గా ప్రాబ్లమ్ తలత్తెడంతో అన్నిచోట్ల ఆగిపోయాయి. ముందుగా ఐమాక్స్ దీన్ని ప్రదర్శించేందుకు సిద్ధం చేశారు. అక్కడ టెక్నికల్‌గా ప్రాబ్లమ్ వచ్చిందని అందుకే విడుదల చేయలేకపోతున్నామని.. తెలుగులో విడుదల చేస్తున్న మల్కాపురం శివకుమార్ తెలిపారు.
అయితే ఆ తర్వాత షో పడింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ప్రస్తుతానికి నాలుగురోజులు హౌస్‌ఫుల్ అయ్యాయి. శుక్రవారం నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' విడుదలైంది. ఇదిలావుండగా.. సూర్య చిత్రం కేరళలో 218, బెంగుళూరులో 317 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఓవర్‌సీస్‌పరంగా మంచి వసూళ్ళను రాబట్టిందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది పక్కా మాస్ చిత్రం కాబట్టి.. లాజిక్‌లను చూడకుండా ఉంటే గొప్ప సినిమా అవుతుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.