శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లిన ఆమె... తన కారును పార్క్ చేసి, షాపింగ్‌కకు వెళ్ళారు. తిరిగొచ్చి చూసేసరికి కారు అద్దాలు పగిలిపోయి ఉండటాన్ని ఆమె గమనించారు. అందులో ఉన్న విలువైన వస్తువులూ కనిపించలేదు. ఒక్కసారిగా దిమ్మెరపోయిన ఆమె కొద్ది నిముషాల పాటు తేరుకోలేకోయారు. ఈ విషయాన్ని చిన్మయి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఫిర్యాదు చేయబోతే పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోలేదని కూడా ఆమె వాపోయింది.