"అతడు''లో అల్లరి పాటకు స్టెప్పులేసిన సితార

సోమవారం, 30 జనవరి 2023 (23:11 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా అల్లరి సాంగ్‌కు సితార అద్భుతంగా డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే మహేష్ తనయ సితార తాజాగా అతడులో త్రిష నర్తించిన అల్లరి పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది. 
 
అచ్చంగా ఆ సాంగ్‌లో త్రిష వేసిన మాదిరిగా స్టెప్స్ అదరగొట్టింది. ప్రస్తుతం సితార డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రిష హీరోయిన్‌గా అతడు సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 2005‌లో మురళి మోహన్ నిర్మించారు. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈమూవీ అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. బంపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంలో పాటకు మహేష్ కుమార్తె డ్యాన్స్ చేయడం వైరల్ అవుతోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు