శోభితను చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున (video)

సెల్వి

మంగళవారం, 29 అక్టోబరు 2024 (08:03 IST)
Sobhita Dhulipala
స్టార్ సెలెబ్రిటీస్ నాగచైతన్య - శోభిత పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఏఎన్నార్ అవార్డు ఈవెంట్‌కు శోభిత నాగచైతన్యతో కలిసి హాజరైంది. ఇక నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ శోభితను పలువురు ప్రముఖులకు, ఈవెంట్‌కి వచ్చిన గెస్టులకు పరిచయం చేసారు. ఈ క్రమంలో నాగార్జున చిరంజీవిని పిలిచి మరీ శోభితను పరిచయం చేసారు. 
 
నాగార్జున చిరంజీవికి తనకు కాబోయే కోడలు శోభితను పరిచయం చేస్తున్న పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫంక్షన్‌కి అటు అక్కినేని ఫ్యామిలీతో పాటు ఇటు చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. 
 
అలానే ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖ సెలబ్రెటీలు సందడి చేశారు. అయితే ఈ ఫంక్షన్‌లో శోభిత ధూళిపాళ-నాగ చైతన్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అవార్డు ప్రదానోత్సవం ముగిసిన తర్వాత అమితాబ్ బచ్చన్‌తో కలిసి అక్కినేని ఫ్యామిలీ ఓ గ్రూప్ ఫొటో తీసుకుంది. ఇందులో కూడా నాగ చైతన్య పక్కనే శోభిత కనిపించింది.

అక్కినేని ఇంటి కోడలునీ @KChiruTweets గారికి పరిచయం చేస్తున్న kING @iamnagarjuna గారు ????????@chay_akkineni @sobhita ♥️????#ANRNationalAward2024 #ANRLivesOn pic.twitter.com/QTzfuYIauU

— Êswar (@Yandamurieswar4) October 28, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు