హీరో అఖిల్ అక్కినేని తన మనసులోని మాటలను బయట పెట్టాడు. 18నెలల సమయంలో సిసింద్రీ సినిమా చేశాను. అది ఇప్పుడు చూస్తే నేనేనా అనిపిస్తుంది. నేను హీరో అయ్యేదాక చాలామంది నేను కనిపిస్తే సిసింద్రీ నువ్వేగా అంటూ బుగ్గ గిల్లేవారు. ఇప్పుడు లేదులేండి.. అంటూ నవ్వారు. నేను హీరో చేసిన అఖిల్ అనే సినిమా నుంచి చేసినవి పెద్దగా ఆడలేదు. అందుకే యాక్షన్ బేస్డ్ కథతో ఏజెంట్ చేశాననంటూ వివరించారు.