తాజాగా మేకర్స్ ఏజెంట్ నుంచి బాయ్స్ సెలబ్రేట్ చేసుకునే బ్రేక్-అప్ సాంగ్ రామాకృష్ణా పాటని విడుదల చేశారు. ఇది బ్రేక్-అప్ సాంగ్ అయినప్పటికీ, అఖిల్ ఈ అకేషన్ ని జరుపుకోవడంతో పండుగ వైబ్ తో అలరించింది. హీరో జీవితాన్ని బ్రేకప్ ప్రభావితం చేయలేదని చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగా చెప్పారు. అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. హిప్ హాప్ తమిళ పెప్పీ నంబర్‌ని స్కోర్ చేయగా, రామ్ మిర్యాల ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడారు.