సోనూసూద్ పుట్టినరోజు కానుక.. 3లక్షల ఉద్యోగాలు..

గురువారం, 30 జులై 2020 (18:02 IST)
తన 47వ పుట్టినరోజును పురస్కరించుకుని మూడు లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలిపాడు. ప్రవాసీ రోజ్ గార్ పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు వివరించాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టా అకౌంట్‌లో వెల్లడించాడు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పాడు. 
 
ఈ కార్యక్రమానికి తనతో భాగస్వామ్యం అయిన సంస్థలకు సోనూ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా.. సోనుసూద్‌ సేవాతత్పరత కొనసాగుతూనే ఉంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు చేర్చిన ఈ రియల్‌లైఫ్‌ హీరో.. ప్రస్తుతం వలస కార్మికుల కోసం 3లక్షల ఉద్యోగాలు కల్పించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు