సోనూసూద్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిన బాలిక.. చెర్రీతో డిష్యూం

శనివారం, 10 జులై 2021 (15:54 IST)
మణికొండకు చెందిన బాలికకు నటుడు సోనూసూద్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. సోనూసూద్‌ ఓ స్పోర్ట్స్‌ యాడ్‌ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న కె. సమీక్షారెడ్డి (12)ని ఎంపిక చేసుకున్నారు.

ఆమె బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా, కోచ్‌గా సోనూ ఆ యాడ్‌లో కనిపించనున్నారు. ఎల్బీస్టేడియంలో ఇందుకోసం శుక్రవారం షూటింగ్‌ నిర్వహించారు. ఈ యాడ్‌ ద్వారా వచ్చే డబ్బులో కొంత సోనుసూద్‌ చారిటీకి, మరికొంత ఆర్‌ఆర్‌సీలో శిక్షణ పొందే పేద క్రీడాకారులకు ఇవ్వనున్నట్లు బాలిక తండ్రి మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ 'ఆచార్య' సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

కరోనా కారణంగా కొన్ని రోజుల క్రితం ఆగిపోయిన షూటింగు రీసెంట్ గా మొదలైంది. చిరంజీవి-చరణ్ సోనూసూద్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చరణ్ - సోనూసూద్‌పై 'కుస్తీ పోటీ'కి సంబంధించిన ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారట. సినిమాలో ఒకానొక కీలకమైన సందర్భంలో వచ్చే ఈ ఎపిసోడ్‌ను కొరటాల చాలా కొత్తగా డిజైన్ చేశాడనీ, చాలా ఇంట్రెస్టింగ్ ‌గా ఉంటుందని అంటున్నారు.
 
ఈ సినిమాలో 'సిద్ధా' అనే పవర్ఫుల్ నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ప్రతినాయకుడి పాత్రలో సోనూ సూద్ నటిస్తున్నాడు. సోనూసూద్ కెరియర్లోనే ఈ పాత్ర ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఇక చరణ్ .. మరికొంతమంది ఫైటర్లపై చిత్రీకరించిన రెయిన్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుందనే టాక్ ఆల్రెడీ బయటికి వచ్చింది. చిరంజీవి సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. ఈ నెలాఖరుకు షూటింగు పార్టును పూర్తిచేసుకుని, దసరాకి విడుదల కానుందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు