కరోనా కష్టకాలంలో గత ఏడాది నుంచి కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ నిర్విరామ సేవలు మొత్తం ప్రపంచమంతా జేజేలు పలుకుతున్నారు. చివరకు మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సైతం చేయలేని పనులు, సహాయలు చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో ఆపదలో ఉన్న వారి కష్టాలు తొలగించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్తనాధాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా www.umeedbysonusood.com కు లాగిన్ అవ్వాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్స్ డిటిడిసి ద్వారా అవసరమైన వారికి పంపబడుతుందని తెలియజేశారు.