గత డిసెంబర్ లో సోనూసూద్ కొత్త సినిమా ఫతేహ్ చేయనున్నట్లు ప్రకటించారు. నేడు అది కార్య రూపం దాల్చింది. సోనూసూద్ ట్విటర్ లో నా తదుపరి మిషన్ ఫతేహ్ ఈరోజు షూటింగ్ ప్రారంభం అని తెలిపారు. ఇందులో జాక్వెలిన్ నటిస్తోంది. ఇద్దరూ క్లాప్ బోర్డు ఉన్న ఫోటోను ప్రారంభ సూచికగా తెలిపారు. ఇందులో పాత్ర కోసం సోనూసూద్ బాడీని తగిన విధంగా మార్చు కున్నారు.