ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, ఫస్ట్‌సింగిల్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. మేకర్స్ ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవి నటించిన సెకండ్ సింగిల్ టచ్ లో ఉండు సాంగ్ విడుదల చేసారు.
లీడ్ పెయిర్ సందడి చేసిన రొమాంటిక్ నెంబర్ లే లే తర్వాత, రెండవ పాట టచ్ లో ఉండు మాస్ అప్పీల్‌కు పర్ఫెక్ట్ లైవ్లీ, హై-ఎనర్జీ బీట్‌ను అందించింది. చంద్రిక రవి లైవ్లీ , కలర్‌ఫుల్ సెట్టింగ్‌లో ప్రదీప్ మాచిరాజుతో కలిసి డ్యాన్స్ చేస్తూ గ్లామర్‌ను యాడ్ చేసింది. ప్రదీప్ తన డైనమిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు, మాస్‌ని అలరించే పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించాడు. చంద్రబోస్ రాసిన మాస్ లిరిక్స్ అలరించాయి. లక్ష్మీ దాస, పి రఘుల ఎనర్జిటిక్ వోకల్స్ ఈ పాటను ఫ్యాన్స్ అఫ్ మాస్ హిట్ చేశాయి.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు.