విశ్వసనీయ సమాచారం మేరకు, ఏపీలో గేమ్ ఛేంజర్ చిత్రానికి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.135, మల్టీప్లెక్స్‌లలో రూ.175 మేర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షో టికెట్ రేట్లు రూ.600కు పెంచుకునే విధంగా ఉండబోతుంది. అలాగే డాకు మహారాజ్ చిత్రానికి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110, మల్టీప్లెక్స్‌లలో రూ.135 పెంపుకు అనుమతినిచ్చారు. ఈ చిత్ర బెనిఫిట్ షోకు రూ.500 మేర పెంపుకు అనుమతినిచ్చారు. మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాంకి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపు ఉండనుంది. ఈసారి సంక్రాంతికి మూడు సినిమాల సక్సెస్ ఏ స్థాయిలో వుంటుందో చూడాలి. ఇక తెలంగాణాలో చివరి నిముషంలో పెంచే సూచనలు కూడాలేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.