యాంకర్ కమ్ యాక్టర్ శ్రీముఖి కన్నీళ్లు పెట్టుకుందంటే ఇదేదో.. సినిమా కోసం అనుకునేరు. కానేకాదు.. రియల్ సీన్. ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రోగ్రామ్‌లో అందరూ వారి తండ్రుల గురించి మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి బుల్లితెర నటులు.. తమ కుమార్తెలు, కుమారులతో వచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో శ్రీముఖి తనకు తండ్రి కంటే తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉందని చెప్పింది.
శ్రీముఖి తండ్రి ఆ వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ... అందరూ తన కుమార్తె గురించి గొప్పగా చెప్తుంటే ఎంతో గర్వంగా వుందన్నారు. శ్రీముఖి తనకు బిడ్డగా పుట్టడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆ మాటలు విని శ్రీముఖి భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంది. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక ఏడ్చేసింది. ఈ సీన్‌ను టీవీలో ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా ప్రసారం చేశారు.