speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

ఐవీఆర్

శనివారం, 19 ఏప్రియల్ 2025 (17:22 IST)
కర్టెసి-ట్విట్టర్
బెంగళూరు: హిందీలో మాట్లాడనందుకు కన్నడిగ ఆటో డ్రైవర్‌ను హిందీ మాట్లాడే వ్యక్తి బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన బెంగళూరులోని ఎస్ఎంఎస్ ఆర్కేడ్ రోడ్డులో జరిగింది. ఒక ఆటో డ్రైవర్‌ను బెదిరిస్తున్నాడు హిందీ మాట్లాడుతున్న వ్యక్తి. దీన్ని ఒక వ్యక్తి వీడియో తీస్తుండగా, మరో మహిళ హిందీ మాట్లాడే యువకుడిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లింది.
 
ఆటో దిగిన యువకుడు హిందీలో మాట్లాడాలని అన్నాడు. ముందు నువ్వు కన్నడ మాట్లాడటం నేర్చుకో.. నువ్వు బెంగళూరు వచ్చావు కదా? అంటూ ఆటో డ్రైవర్ బదులిచ్చాడు.
 

Hindi speakers create chaos in #Bengaluru – threaten Kannada rickshaw driver to speak in Hindi!
Why do migrant Hindi speakers often display hostility or intolerance towards regional languages?#hindiGoBack #मराठी #Marathi #HindiImposition #StopHindiImposition #Kannada pic.twitter.com/RYHoIuGIHI

— Mahesh Patil - Benadikar ???????? (@MaheshPatil_B) April 19, 2025
ఈ సమయంలో, ఆ యువకుడితో ఉన్న స్త్రీ అతడిని వారిస్తూ తనతో తీసుకుని వెళ్లింది. ఆ యువకుడు పోతూపోతూ, "నువ్వు బెంగళూరులో నివసించాలనుకుంటే, హిందీ మాట్లాడటం నేర్చుకో" అని అన్నాడు. ఆటో డ్రైవర్ ఎదురుదాడి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు