వ్యభిచారిగా చిత్రీకరించారు... వారాహిపై శ్రీరెడ్డి ఫిర్యాదు

ఆదివారం, 29 జులై 2018 (12:36 IST)
తమిళ నటుడు, దర్శక, నిర్మాత వారాహిపై నటి శ్రీరెడ్డి మండిపడ్డారు. తనను వారాహి ఓ వ్యభిచారిగా చిత్రీకరించాడని ఆరోపించింది. ఇదే అంశంపై చెన్నై నగర పోలీసుల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది.
 
ఇదే అంశంపై శ్రీరెడ్డి మాట్లాడుతూ, 'సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్‌ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను' అని చెప్పుకొచ్చింది. 
 
ఈ అంశాలనే తాను ఫిర్యాదులో పేర్కొన్నట్టు శ్రీరెడ్డి తెలిపారు. అంతేకాకుండా, నటీమణులపై లైంగిక వేధింపుల గురించి నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌, ప్రధాన కార్యదర్శి విశాల్‌, కోశాధికారి కార్తీలకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా, వాళ్లు తనను పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. 
 
క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి.. తెలుగులో పలురు హీరోలు, హీరోయిన్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత చెన్నైకు వెళ్లి కోలీవుడ్‌లో పలువురు హీరోలపై ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు