తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగర్ జిల్లాకు చెందిన మనోహర్ లోధి (45) అనే వ్యక్తికి భార్య ద్రౌపది ఉండగా, ఈమె తన భర్త చిన్ననాటి స్నేహితుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం మనోహర్ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ద్రౌపదిని నిలదీశారు. ఆ పాడు పనిని మానుకోవాలని హితవు పలికారు. అయితే, అందుకు ఆమె నిరాకరించడమేకాకుండా తమను వేధిస్తున్నారంటూ తన భర్త, అత్తమామలపై తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెడతామని బెదిరించింది.
భార్య బెదిరింపులతో తీవ్ర మనోవేదనతోపాటు ఆందోళన చెందిన మనోహర్ లోధి, ఆయన తల్లి పుల్రాని లోధి (70), కుమార్తె శివాని (18), కుమారుడు అంకిత్ (16)లు కలిసి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. వీరంతా కలిసికట్టుగా ఆత్మహత్యకు పాల్పడగా, పుల్రానీ, అంకిత్‌కు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శివానీ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన మనోహర్ లోధిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు.