బాహుబలి తొలి భాగాన్ని సూర్యకు చెందిన స్టూడియో గ్రీన్‌తో కలసి ప్రభాస్ హోం బ్యానర్ వంటిదైన యువి క్రియేషన్స్ తమిళంలో విడుదల చేసింది. మొదటి పార్ట్‌ని అక్కడ 28 కోట్లకు అమ్మితే, రూ.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. దాంతో నిర్మాతలు రెండో పార్ట్‌ని ఏకంగా రూ.54 కోట్లు చెప్తున్నట్లు సమాచారం.
ఈ రేటు చూసి ప్రభాస్‌తో పాటు, స్టూడియో గ్రీన్ వాళ్లూ జంకుతున్నారట. మరి బాహుబలి 2పై భారీ అంచనాలున్న నేపథ్యంలో రూ.54 కోట్లు డిమాండ్ చేయడం పెద్దవిషయం కాదని నిర్మాతలు చెప్తున్నారు. మరి బాహుబలి తమిళ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.