పవన్ కళ్యాణ్ గురించి మూడు ముక్కలడిగిన రానా... జక్కన్న ఆన్సర్స్ అదుర్స్

బుధవారం, 28 జూన్ 2017 (19:49 IST)
ఒకవైపు ఏపీ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కోసం అభ్యర్థుల వేటలో వున్నారు. ఇప్పటికే పలు స్థానాల నుంచి పోటీ చేసే వారి లిస్టు తయారుచేసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే బాహుబలి చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన దర్శకుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ పైన పొగడ్తల వర్షం కురిపించారు. 
 
పవన్ కళ్యాణ్ గురించి మూడు ముక్కలు చెప్పమని రానా అడిగితే... సిన్సియర్, ట్రూత్ ఫుల్, హీరో-వర్షిప్ అంటూ చెప్పేశారు. ఇక మహేష్ బాబు గురించి అడగ్గా... హ్యాండ్‌సమ్, హ్యాండ్‌సమ్, హ్యాండ్‌సమ్ అని చెప్పారు.
 
ప్రభాస్ నటుడిగా కాకపోయి వుంటే ఏమైతే బావుంటుందని అడిగితే... చెఫ్ అయితే బావుంటుందని అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడైతే బాగుంటుందనీ, రాంచరణ్ వ్యాపారవేత్త అయితే బావుంటుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి