స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రజలకు ప్రపంచ స్థాయి లివర్ కేర్ అందించడంతో పాటు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహకులు తెలిపారు. స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, స్టార్ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గూడపాటి, స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ మెంటార్ డాక్టర్ కే రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి , రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్, డాక్టర్ రమేష్ కంచర్ల పాల్గొని, ఈ గొప్ప కార్యాన్ని ప్రారంభించడానికి వచ్చిన రాజమౌళికి.. ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, వైద్యనిపుణులు, అతిథులు ఆసుపత్రి సౌకర్యాలు, సేవలను ప్రశంసించారు.