ఇప్పటికే 120 మందికి పైగా గాయపడిన వారిని రక్షించామని, గాయపడిన వారిలో 35 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వివరించారని అధికారులు తెలిపారు. చాలా మంది ఇంకా కనిపించడం లేదని, గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మేఘాల విస్ఫోటనం తర్వాత రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), పోలీసులు, సైన్యం, స్థానిక స్వచ్ఛంద సేవకులు సంయుక్తంగా సహాయక చర్యలు ప్రారంభించారు. సైన్యం సహాయక చర్య కోసం 300 మందికి పైగా సైనికులను నియమించారు.
డజన్ల కొద్దీ ఇళ్లు, 6 ప్రభుత్వ భవనాలు, 3 దేవాలయాలు, గోశాలలు, ఒక వంతెన దిగువన ఉన్న మేఘాల విస్ఫోటనం కారణంగా నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు శిథిలాల కింద నుంచి 167 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హామీ ఇచ్చారు.