రేడియోలో వాతావరణ రిపోర్ట్ తో వీడియో ప్రారంభమవుతుంది. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఆయుధాలతో వస్తారు. అతని ముఖం కనిపించనప్పటికీ సుధీర్ బాబు కుర్చీలో కూర్చుని చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తారు. చివరగా అతని తుపాకీ నుండి ఫస్ట్ ట్రిగ్గర్ విడుదలౌతుంది. “అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు... కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది... ఇది నాకేమో సెప్తావుంది...” అని సుధీర్ బాబు కుప్పం యాసలో అదరగొట్టాడు.
మాండలికం, అతని వాయిస్ బేస్ పాత్రకు ఇంటెన్స్ తెస్తుంది. సుధీర్ బాబు సినిమా కోసం పూర్తిగా మేక్ఓవర్ అయ్యారు. ఫస్ట్ ట్రిగ్గర్ యాక్షన్ తో నిండివుంది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. హరోం హర కథ 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్-ఇండియా విడుదల కానుంది.