కొర‌టాల శివ‌ను అభినందించిన సుకుమార్‌, హ‌రీష్ శంక‌ర్‌

శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (18:15 IST)
Koratala Siva, Sukumar, Harish Shankar
ఈరోజే విడుద‌లైన మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు అభినంద‌న‌లు తెలుపుతూ తోటి ద‌ర్శ‌కులు సుకుమార్‌, హ‌రీష్ శంక‌ర్ చిత్ర నిర్మాణ సంస్థ వ‌ద్ద ట‌పాసులు కాల్చి కేక్ క‌ట్ చేయించారు. ఈ వేడుక‌లో చిత్ర నిర్మాత‌లు పాల్గొన్నారు.
 
ఆచార్య సినిమా టేకింగ్ బాగుంద‌నీ, న‌గ్జ‌లైట్ బ్యాక్‌డ్రాప్లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌లు హైలైట్‌గా వున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా కొర‌టాల శివ‌ను సుకుమార్‌, హ‌రీష్ శంక‌ర్ అభినందించారు. అయితే ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పాత్ర షూట్ చేశాక తీసేయ‌డంతోపాటు రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌లో ముగింపు క్లారిటీ మిస్ కావ‌డం వంటి కొన్ని లోపాలున్నాయ‌ని ప్రేక్ష‌కులు ఫీల‌వుతున్నారు. మొత్తంగా చిరంజీవి డాన్స్ ఇర‌గ‌దీశాడ‌ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు