రెండు కాళ్లు పైకెత్తి పందిని కొట్టినట్లు కొట్టారు: RRR గురించి కామినేని వ్యాఖ్యలు వైరల్ (video)

ఐవీఆర్

శనివారం, 27 సెప్టెంబరు 2025 (13:48 IST)
అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో సహజంగా క్లాసులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి క్లాసులు సహజంగా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఇస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు తీరు చూస్తుంటే మళ్లీ క్లాసులు నిర్వహిస్తే బాగుంటుందేమోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొన్న నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు కాస్తా మెగాస్టార్ చిరంజీవికి చుట్టుకున్నాయి. దానిపైన రచ్చరచ్చ జరుగుతోంది.
 
అదే విషయంపై కామినేని శ్రీనివాస రావు మాట్లాడి, ఆ తర్వాత మరుసటి రోజు తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విన్నవించారు. ఈ సంగతి అలా వుంటే.. తాజాగా ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుతూ... గతంలో మీరు ఎంపిగా వుండి నాలుగు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో అడుగుపెట్టలేకపోయారు.
 
అక్రమ కేసు పెట్టి పోలీసు స్టేషనులో బల్లపై పడుకోబెట్టి రెండుకాళ్లను పైకెత్తి... పందిని పైకెత్తినట్లు పైకెత్తి దారుణంగా కొట్టి హింసించారంటూ ఆయన మాట్లాడిన తీరుపై పలువురు నెటిజన్లు... ఆ పోలిక ఏమిటి కామినేని గారూ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

రఘురాం కృష్ణంరాజు ను ఒక రేంజ్ లో ర్యాగింగ్ చేసినట్లు ఉందే
అయినా ఆ పోల్చడం ఏమిటండి బాబు వీడియో చూస్తున్న మాకే ఇంత నవ్వు వస్తున్నది
వింటున్న RRR పరిస్థితి ఏమిటో pic.twitter.com/8RREMUxtbT

— Anitha Reddy (@Anithareddyatp) September 27, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు