భారీ వరదనీరు రోడ్లపైకి రావడంతో రోడ్లు మూసివేత కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను గచ్చిబౌలి, ఇతర సమీప మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
ఇంకా మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంజీబీఎస్ ప్రాంగణంలో వరద నీరు చేరడంతో టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా బస్సులను నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. ఈ మేరకు వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి.
అలాగే సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయని టీజీఎస్సార్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.