వెండితెర అరంగేట్రం చేసిన నిహారిక నటించిన తొలి చిత్రం "ఒక మనసు". ఈ చిత్రానికి మిశ్రమ టాక్ వచ్చింది. ఇపుడు ఆమె రెండో సినిమాపై అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. హ్యపి వెడ్డింగ్ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ఇందులో "పాల లాంటిది మా హర్ష.. కాఫీ చేసుకోవచ్చు, కాంప్లైన్ చేసుకోవచ్చు.. మరి మా మనవడితో కాపురం చేసుకోవచ్చా అండి" అనే డైలాగ్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక తాజాగా విడుదలైన ప్రోమో సాంగ్ కూడా అలరించింది. ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం బాణీలు సమకూర్చారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించాడు. యూవీ క్రియేషన్స్ మరియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.