అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

ఠాగూర్

ఆదివారం, 24 ఆగస్టు 2025 (10:59 IST)
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం అత్తమామలతో కలిసి కట్టుకున్న భర్త తీవ్రంగా వేధించారు. అంతటితో వారి కోపం చల్లారకపోవడంతో ఇంటి కోడలికి నిప్పంటిచారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
2016లో గ్రేటర్‌ నోయిడాకు చెందిన నిక్కీ, ఆమె అక్క కంచన్‌ను సిర్సా ప్రాంతానికి చెందిన అన్నదమ్ములకు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా కారు, విలువైన వస్తువులు ఇచ్చినప్పటికీ.. మరో రూ.35 లక్షలు అదనపు కట్నం ఇవ్వాలని వారి అత్తామామలు తమను తరచూ వేధింపులకు గురిచేసేవారని మృతురాలి సోదరి పేర్కొంది. 
 
గురువారం అదనపు కట్నం కోసం నిక్కీని ఆమె భర్త విపిన్‌, అత్త గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని.. తన సోదరిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె భర్త పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని వెల్లడించింది. స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందిందని పేర్కొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.
 
 
గ్రేటర్ నోయిడాకు చెందిన నిక్కీ అనే మహిళను కాలిన గాయాలతో గురువారం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. తన సోదరిని అత్తింటివారే హత్య చేశారని మృతురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీసులకు కీలక వీడియో లభ్యమైంది. అందులో మృతురాలి భర్త, అత్త ఆమెను జుట్టు పట్టి లాగి కొడుతూ.. నిప్పంటించిన దృశ్యాలు కనిపించాయి. వీడియో ఆధారంగా పోలీసులు నిక్కీ భర్త విపిన్‌, అత్త, మామ, బావమరిది సహా నలుగురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు