విమాన ప్రమాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పైలట్ ప్రావీణ్యంతో బయటపడి పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. సన్నీ తన భర్త డేనియల్, మరికొందరు స్నేహితులతో కలిసి బుధవారం ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో విమానం కుదుపులకు గురైంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని జాగ్రత్తగా మారుమూల ప్రాంతంలో దింపేశాడు.
మేము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు! వాతావరణం అనుకూలించని కారణంగా మా ప్రైవేటు విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం ఇంటికి వెళుతున్నాము.. థ్యాంక్స్ గాడ్ అని సన్ని ట్వీట్ చేశారు. పైలట్స్ అద్భుతమైన నైపుణ్యం కలవారని, తమ జీవితాలను కాపాడారని సన్ని చెప్పారు. సన్నీ ప్రాణాలతో బయటపడటంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.