అయితే, 21 యేళ్ల పాటు వరుసగా ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా థియేటర్లలో ఉంటూ వచ్చింది. అందువల్లే ఆ అరుదైన రికార్డు కృష్ణ ఖాతాలో చేరిపోయింది. ఈ కారణంగానే కృష్ణను తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరూ సంక్రాంతి మొనగాడుగా పిలిచేవారు.
పైగా, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పోటీపడుతూ తన చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిచేలా ప్లాన్ చేసుకునేవారు. ఇందుకోసం ఆయన గ్రామీణ నేపథ్యంలోని కథలను ఎక్కువగా ఇష్టపడేవారు. పల్లెటూరు బుల్లోడుగా ముల్లుగర్ర చేతబట్టి, పొలంగట్లపై ఫైట్లు, పాటలు పాడేలా తనను వెండితెరపై చూసుకునేందుకు కృష్ణ అమితంగా ఇష్టపడేవారు.