తమ ఇంటి గొడవల సమయంలో ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన కేసులో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు ఈ పిటీషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కొద్ది సేపటి తరువాత మళ్లీ కోర్టుకు వచ్చిన ముకుల్ రోహత్గీ... మోహన్ బాబు బెయిల్ పిటీషన్‌ను విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించలేదు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారం జరుగనుంది. కాగా, ఈ దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే.