ఈ ఘర్షణలో, మోహన్ బాబు జర్నలిస్టు చేతుల నుండి మైక్రోఫోన్‌ను లాక్కొని అతనిపై శారీరకంగా దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత, మోహన్ బాబుపై కేసు నమోదైంది.
దీనితో ఆయన ముందస్తు బెయిల్ కోరాడు. అయితే, డిసెంబర్ 23న, తెలంగాణ హైకోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. ఆపై మోహన్ బాబు సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. ఇటీవల, సుప్రీంకోర్టు ఈ కేసును సమీక్షించి, మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.