పద్మావతీ సినిమాకు రూట్ క్లియర్.. స్టే విధించేందుకు సుప్రీం నో

శనివారం, 11 నవంబరు 2017 (10:43 IST)
పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగా పద్మావతి ఉందంటూ సుప్రీంలో పిటిషన్లు దాఖలైంది. 
 
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం స్టే విధించడం కుదరదని స్పష్టం  చేసింది. ఏదైనా సినిమా విడుదలకు ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్సీ) అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. దీంతో ‘పద్మావతి’ సినిమా విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది. 
 
ఇకపోతే.. పద్మావతి రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా వుందని.. చరిత్రకు విరుద్ధంగా సినిమాను రూపొందించారని.. తక్షణం ఆ సినిమా విడుదలపై స్టే విధించాల్సిందిగా కోరుతూ, సిద్ధరాజ్‌ సిన్హ్‌తో పాటు 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ సినిమా విడుదలపై స్టే విధించబోమని తేల్చిచెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు