ఈ వార్తలను ఆమె కొట్టిపారేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే సురేఖ వాణి నుదుట పైన బొట్టు, మెడలో నల్లపూసలు ధరించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. మామూలుగా భర్త చనిపోయిన స్త్రీలు ఎవరు కూడా నుదుటిమీద కుంకుమ పెట్టుకోవడానికి కానీ మెడలో నల్లపూసలు వేసుకోవడానికి కానీ ఇష్టపడరు.
ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సురేఖ వాణి చీర కట్టుకొని మెడలో పసుపుతాడు, నల్ల పూసలు, పపిట్లో బొట్టు పెట్టుకుని ఉన్న వీడియో, ఫొటోస్ షేర్ చేయగా.. అవి వైరల్ అవుతుంది. దాంతో ఆమెను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఆమె వ్యక్తిగత జీవితాన్ని విమర్శించే హక్కు మనకి లేదంటూ.. ఇదంతా సినిమా షూటింగ్ భాగమేనని మద్దతిస్తున్నారు.