మలయాళ తార కీర్తి సురేష్ సూర్యతో నటించేందుకు రెడీ అవుతోంది. శివ కార్తీకేయన్‌తో ఓ సినిమాలో నటించి కోలీవుడ్‌ను షేక్ చేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం ధనుష్, విజయ్‌ల సరసన నటిస్తోంది. ప్రస్తుతం సెట్‌పై ఉన్న "ఎంగ వీట్టుపిళ్లై" చిత్రంలో నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తోంది. దీంతో సహజంగానే ఆమె క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో 24 హీరో సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
సూర్య ప్రస్తుతం సింగం3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా, అనుష్క, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక సూర్య, కీర్తి సురేష్‌ల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.