పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. దీనితో ఆ బాలికను తనే చూసుకుంటానని ఆమె బాబాయి తన ఇంటికి తీసుకుని వచ్చాడు. బాలిక అక్కడే వుండి చదువుకుంటోంది. కూతురుతో సమానమైన ఆ బాలిక పట్ల అతడు కామాంధుడుగా మారాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరుగుతున్న దారుణాన్ని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర అనారోగ్యంతో వున్న ఆ బాలికను పోలీసులు ఆసుపత్రికి పంపగా అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అయిందని తేల్చారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.