ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్, ఫ్యాన్స్ గొడవ, జనసేన పార్టీ ఆవిర్భావం వంటి అంశాలపై తిరుపతిలో ఏర్పాటైన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఏకిపారేశారు. అలాగే ఎంపీలపై కూడా సీరియస్ అయ్యారు.