తాజాగా ఈ హీరో నటిస్తున్న సినిమా 'ఎన్.జి.కె (నంద గోపాల కృష్ణ)', దీనికి '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వం వహిస్తుండగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాను తమిళనాడుతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ అందిస్తున్నారు.
అయితే రెండు భాషల్లో ఒకే టైటిల్ పెడితే బాగుంటుందని, అప్పుడే ఆడియన్స్ రీచ్ ఎక్కువగా ఉంటుందని మా పి.ఆర్ టీమ్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ సలహా ఇవ్వడంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది.