సుశాంత్‌కి అవార్డులు రాకుండా అడ్డుకున్నారు.. కంగనా రనౌత్ (video)

మంగళవారం, 16 జూన్ 2020 (11:25 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బంధుప్రీతి కారణంగానే సుశాంత్‌కి అవకాశాలు రాకుండా చేశారని ఫైర్ అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలహీనమైన మనస్తత్వం గలవాడని.. అందుకే ఒత్తిళ్లను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడని కథనాలు రాయడంపై ఆమె మీడియాను దుయ్యబట్టింది.
 
తనకు సినీపరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేదని, పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్స్ లేనందున తన సినిమాలు చూసి తనను ఆదరించాల్సిందిగా సుశాంత్ వేడుకుంటున్నట్టుగా గతంలో వైరల్ అయిన ఓ సోషల్ మీడియా పోస్టును కంగనా రనౌత్ గుర్తు చేశారు. 
 
సుశాంత్ ఎన్ని గొప్ప సినిమాలు చేసినా.. అతడికి సరైన ఆధరణ లభించలేదని అందుకు కొంతమంది నిర్మాతలు, నటుల బంధుప్రీతి కారణమని కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. సుశాంత్‌కి అవార్డులు రాకుండా అడ్డుకున్నారని ఆమె తీవ్రంగా మండిపడింది.
 
కాగా.. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌(34) ముంబై నగరం బాంద్రా రెసిడెన్సీలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు