సాధారణంగా పులి కంటపడితే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది పులితో సెల్ఫీ తీసుకోవడం అనేది ఓ సాహసంతో కూడుకున్నపనే. కానీ, ఈ బాలీవుడ్ నటి మాత్రం పులితో సెల్ఫీ తీసుకుంది. ఆమెతో పాటు.. ఆమె కుమార్తెలు కూడా ఈ సాహసానికి దిగారు. ఇంతకీ ఆ బాలీవుడ్ నటి ఎవరనే కదా మీ సందేహం. ఇంకెవరో కాదు.. సుస్మితా సేన్.
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి థాయ్‌లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ పులితో ఫోటోలు తిగింది. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె కూతుళ్లు కూడా పులితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఎక్కువ సమయం పిల్లలతో గడిపేందుకే కేటాయిస్తున్న సుస్మిత తమ హాలిడే ట్రిప్ పూర్తయిన తర్వాతే సినిమాలు, నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తానని చెబుతోంది.