యాంకర్‌గా, నటిగా, గాయకురాలిగా కలర్స్ స్వాతి పేరు కొట్టేసింది. డబ్బింగ్ కళాకారిణిగానూ మంచి మార్కులు కొట్టేసింది. మాటీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది.
కలర్స్ స్వాతి అని పిలువబడే స్వాతిరెడ్డి శుక్రవారం తన ప్రియుడు వికాస్‌ను పెళ్లి చేసుకుంది. మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్న వికాస్‌ను పెళ్లాడింది. తమ ప్రేమను ఇంట్లో ఒప్పించి, పెద్దల ఆశీస్సులతో వివాహం చేసుకుంది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.