నష్టాల్లో 'సైరా నరసింహా రెడ్డి' : 18 రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

సోమవారం, 21 అక్టోబరు 2019 (14:29 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి", నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులు నటించారు. హీరో రాంచరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో 104 కోట్ల రూపాయల షేర్‌ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.229 కోట్ల గ్రాస్‌ను, రూ.140 కోట్ల షేర్‌ను రాబట్టింది. 
 
ఈ 18 రోజుల్లో ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా రూ.32 కోట్లకి పైగా వసూలు చేయడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు.. సైరా నరసింహా రెడ్డి చిత్రానికి విశేష ప్రజాధారణ లభించినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా లేవన్నది ఇన్‌సైడ్ టాక్‌గా వుంది. అనేక ఏరిపాయాల్లో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాన్న ప్రచారం ఉంది. ఈ కారణంగా ఈ చిత్రం నష్టాలను చవిచూసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పంపిణీదారులు పూర్తి నిరాశలో కూరుకునిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు